: హైదరాబాదును యూటీ చేయాలనడం హాస్యాస్పదం: కర్నూలు వైసీపీ నేత


హైదరాబాదును యూటీ చేయాలంటూ ఏపీ టీడీపీ నేతలు చేస్తున్న డిమాండును కర్నూలు వైసీపీ నేతలు కొట్టిపారేశారు. ఈ డిమాండు హాస్యాస్పదమని జిల్లా వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాదులో సెక్షన్ 8 అమలు చేయాలని తాము గట్టిగా కోరుతున్నామన్నారు. ఇక్కడి సీమాంధ్రుల హక్కులకు భంగం కలిగితే తమ పార్టీ ముందుండి పోరాడుతుందని చెప్పారు. అయినా చంద్రబాబు సొంత హక్కుల కోసమే ఈ సెక్షన్ 8ను ముందుకు తెచ్చారని మోహన్ రెడ్డి విమర్శించారు.

  • Loading...

More Telugu News