: హై ఫీవర్ తో ఆసుపత్రిపాలైన ములాయం


సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ హై ఫీవర్ తో ఆసుపత్రి పాలయ్యారు. తీవ్ర జ్వరం కారణంగా ఆయన గుర్గావ్ లోని మెడిసిటీ మేదాంత ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం ఆయన జ్వరం కారణంగా అసౌకర్యానికి గురయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో, ఆయనను ఆసుపత్రికి తరలించారు. ములాయంకు అల్ట్రా సౌండ్, సీటీ స్కాన్ సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. కాగా, మార్చి నెలలోనూ ములాయం ఉదరంలో ఇన్ఫెక్షన్ కారణంగా ఇదే ఆసుపత్రిలో చేరారట.

  • Loading...

More Telugu News