: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
వరుసగా ఆరు రోజుల పాటు పతనమవుతూ వచ్చిన బంగారం ధరలు ఏడవ రోజు బలపడ్డాయి. బులియన్ మార్కెట్ లో ఈ రోజు పసిడి ధర స్వల్పంగా రూ.30 పెరిగింది. దాంతో 10 గ్రాముల ధర రూ.26,710కి చేరింది. అటు వెండి ధర కూడా రూ.210 పెరిగి, కేజీ ధర రూ.36,400 పలుకుతోంది. అనుకూల ప్రపంచ మార్కెట్లు, ఆభరణాల వ్యాపారులు, రిటైలర్లు, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లకు పాల్పడడంతో ఈ రెండు లోహాల ధరలు పెరిగాయని బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.