: యాక్సెంచర్ లో కొత్తగా 95 వేల ఉద్యోగాలు!


కన్సల్టింగ్, అవుట్ సోర్సింగ్ సంస్థ యాక్సెంచర్ ఆగస్టుతో ముగిసే ఆర్థిక సంవత్సరానికి 95,000 ఉద్యోగ నియామకాలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. కాగా, ఈ ఉద్యోగాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉండనున్నాయి. ఇప్పటికే 3,36,000 మంది ఉద్యోగులు కలిగిన యాక్సెంచర్, ఉద్యోగాల కల్పనలో టాటా కన్సల్టెన్సీ సంస్థ కంటే ముందుంది. మొత్తం ఉద్యోగుల్లో 3 లక్షల మంది భారతీయులు కావడం విశేషం. దేశీయంగా మార్చి వరకు ఆర్థిక సంవత్సరంగా గణించినా, యాక్సెంచర్ మాత్రం సెప్టెంబర్ నుంచి ఆగస్టును ఆర్థిక సంవత్సరంగా భావిస్తుంది. దీంతో, మే 31తో ముగిసిన మూడో త్రైమాసికంలో 7.8 బిలియన్ డాలర్లు ఆర్జించినట్టు తెలిపిన యాక్సెంచర్, నాలుగో త్రైమాసికంలో 7.45 నుంచి 7.70 బిలియన్ డాలర్ల లాభాలు వస్తాయని భావిస్తోంది.

  • Loading...

More Telugu News