: కేరళ మాజీ మంత్రి, సినీ నటుడు గణేష్ కుమార్ కి నోటీసులు
కేరళ మాజీ మంత్రి, సినీ నటుడు గణేష్ కుమార్ కి విజిలెన్స్ న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. పలు మలయాళ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితుడైన గణేష్ కుమార్, కావిలమ్మ భగవతి ఆలయానికి కానుకగా అందజేసేందుకు కేరళ అటవీ శాఖ నుంచి ఓ ఏనుగును 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం దానిని ఆరు నెలలలోపు ఆలయానికి అందజేయాలి. అయితే గణేష్ కుమార్ దానిని దేవాలయానికి కానుకగా ఇవ్వకుండా, పండగలు, ఊరేగింపులకు అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విజిలెన్స్ న్యాయస్థానానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో, న్యాయస్థానం అతనికి నోటీసులు జారీ చేసింది.