: ఈ ఏడాది చివరినుంచి బ్రిక్స్ బ్యాంకు కార్యకలాపాలు


బ్రిక్స్ దేశాలు ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న బ్రిక్స్ బ్యాంకు ఈ ఏడాది చివరి నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని దక్షిణాఫ్రికా ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 'ద న్యూ డెవలప్ మెంట్ బ్యాక్' కార్యకలాపాలు 2015 చివరి నాటికి ఆరంభమవుతాయని తెలిపింది. బ్రిక్స్ దేశాలు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా ఈ బ్యాంకులో భాగస్వామ్యం కలిగి ఉంటాయి. 2013లో బ్రిక్స్ దేశాల సదస్సు సందర్భంగా ఓ బ్యాంకు ఉంటే బాగుంటుందని ఆయా దేశాల ప్రతినిధులు సూచించారు. మిగతా ప్రపంచ దేశాల పారిశ్రామిక ప్రగతితో పోటీపడేందుకు, ఆయా దేశాలకు, బ్రిక్స్ దేశాలకు నడుమ ఉన్న అంతరం పూడ్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ బ్యాంకు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News