: మద్యం టెండర్లకు సాయంత్రంతో ముగియనున్న గడువు...బారులు తీరిన వ్యాపారులు


ఏపీలో కొత్త మద్యం పాలసీ వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానుంది. ఈ పాలసీ ప్రకారం దుకాణాలను నిర్వహించుకునేందుకు ప్రస్తుతం వ్యాపారుల నుంచి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తోంది. నేటి సాయంత్రంతో టెండర్లు వేసేందుకు గడువు ముగియనుంది. దీంతో నిన్నటిదాకా కాస్త నెమ్మదిగానే ఉన్న వ్యాపారులు ప్రస్తుతం టెండర్ బాక్సుల వద్ద క్యూ కట్టారు. ఏపీలోని 13 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మారిన మద్యం పాలసీ ప్రకారం ఇకపై సిండికేట్ వ్యాపారానికి చెల్లుచీటి ఇవ్వాల్సిందే. ఈ నేపథ్యంలో గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని బడా మద్యం వ్యాపారులు టెండర్లకు దూరంగా ఉన్నట్లు సమాచారం. గతేడాది అవకాశం చిక్కని వ్యాపారులు ఈ సారైనా మద్యం దుకాణాలను దక్కించుకోవాలన్న ఉత్సుకతతో అబ్కారీ కార్యాలయాల వద్ద బారులు తీరారు.

  • Loading...

More Telugu News