: సార్క్ దేశాల కోసం భారత్ శాటిలైట్
సార్క్ దేశాల కోసం భారత్ ఓ శాటిలైట్ ను ప్రయోగించనుంది. దీన్ని పూర్తిగా సార్క్ దేశాల ప్రయోజనాల కొరకు అంకితం చేస్తారు. ఈ ఉపగ్రహాన్ని 2016 డిసెంబర్ లో ప్రయోగిస్తామని ఇస్రో చీఫ్ ఏఎస్ కిరణ్ కుమార్ చెప్పారు. ఈ రెండు టన్నుల శాటిలైట్ లో 12 కేయూ బ్యాండ్ ట్రాన్స్ పాండర్లు ఉంటాయని, కమ్యూనికేషన్, విద్య, టెలీ మెడిసిన్, విపత్తు సహాయక చర్యల పర్యవేక్షణ, ఇతరత్రా సహాయ చర్యల కోసం ఈ శాటిలైట్ ను వినియోగిస్తామని తెలిపారు. ఖాట్మండూ సార్క్ సమావేశాల్లో ఈ శాటిలైట్ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చింది. కాగా, ఈ శాటిలైట్ నిర్మాణానికి 18 నెలలు పట్టనుంది. బెంగళూరులోని ఇస్రో సెంటర్ లో నిర్మితమయ్యే ఈ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగిస్తారు.