: చట్టం తన పని తాను చేసుకుపోతుంది... కేటీఆర్ నోట మరోసారి అదే మాట!
‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అనే మాట తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నోట మరోమారు వినిపించింది. నేటి ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన చట్టంలోని పదో అధికరణ కిందకు వచ్చే సంస్థల నిధులపై ఏపీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును నిరసించారు. సదరు సంస్థల బ్యాంకు ఖాతాల నుంచి ఏపీ సర్కారు తమకు తెలియకుండానే రూ.1,270 కోట్లను బదిలీ చేసుకుందని, ఈ నిధులన్నింటినీ తిరిగి తమకు ఇప్పించాలని జైట్లీని కోరానని చెప్పారు.