: పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ లో దాడుల పర్వం... తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు!


తిరుపతిలో నేటి ఉదయం ప్రారంభమైన పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ప్రభుత్వ కళాశాలల్లోని సీట్ల భర్తీ కోసం జరుగుతున్న కౌన్సిలింగ్ లోకి ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు, ప్రతినిధులు చొరబడ్డారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను మభ్యపెట్టి తమ కళాశాలల్లో చేర్చుకునేందుకు పన్నాగం పన్నారు. అయితే ప్రైవేట్ కళాశాలల ఆగడాలను ముందుగానే పసిగట్టిన విద్యార్థి సంఘాలు కౌన్సిలింగ్ వద్దకు చేరుకున్నాయి. ప్రైవేట్ కళాశాలల ప్రతినిధులను అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య పరస్పర దాడులు చోటుచేసుకున్నాయి. దీంతో కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిచిపోగా, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News