: ప్రైవేట్ బస్సులో మరో భారీ చోరీ... నాలుగు కిలోల బంగారం అదృశ్యం!


మొన్నటికి మొన్న హైదరాబాదు నుంచి చెన్నై వెళుతున్న కేశినేని ట్రావెల్స్ బస్సులో గుర్తు తెలియని వ్యక్తులు ఐదు కిలోల బంగారం ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వెలుగుచూసిన ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తు దాదాపు అటకెక్కిందనే చెప్పాలి. ఈ ఘటన మరువకముందే మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల సమీపంలో ఇదే తరహా చోరీ మరొకటి కొద్దిసేపటి క్రితం వెలుగుచూసింది. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి హైదరాబాదు బయలుదేరిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నాలుగు కిలోల బంగారం ఉన్న బ్యాగ్ మాయమైంది. సదరు బ్యాగు యజమాని ఇటిక్యాల వద్ద చోరీ విషయాన్ని గుర్తించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా, ఎలాంటి భద్రత లేకుండా కిలోల కొద్ది బంగారాన్ని బ్యాగుల్లో సర్దేసుకుని ఎలా వస్తారన్న పోలీసుల ప్రశ్నలకు సదరు బ్యాగు యజమాని నోట మాట రాలేదట.

  • Loading...

More Telugu News