: స్నానాల గదుల్లో రహస్య కెమెరాలు... మహిళలకు వేధింపులు: ‘అనంత’లో కీచకుడి అరెస్ట్
అనంతపురం జిల్లాలో మరో కీచక పర్వం వెలుగుచూసింది. కళ్యాణ మండపాలను కేంద్రంగా చేసుకుని ఓ యువకుడు సాగించిన ఈ కీచక పర్వాన్ని ఎట్టకేలకు పోలీసులు భగ్నం చేశారు. సదరు కీచకుడిని కటకటాల వెనక్కు నెట్టారు. వివరాల్లోకెళితే... జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివాహాలు, శుభకార్యాల నిర్వహణ కోసం ఏర్పాటైన కళ్యాణమండపాలను కేంద్రంగా చేసుకున్న ఓ యువకుడు వాటిలోని స్నానాల గదుల్లో రహస్య కెమెరాలను అమర్చాడు. సదరు స్నానాల గదుల్లోకి వెళ్లిన మహిళల చిత్రాలను షూట్ చేశాడు. ఆ తర్వాత సదరు మహిళలకు ఫోన్ చేసి డబ్బు కోసం వేధింపులకు పాల్పడ్డాడు. అతడి వేధింపులకు తాళలేక కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కీచకుడిని అరెస్ట్ చేశారు.