: ఆ దాడులు చేసింది మేమే: ఐఎస్ఐఎస్
ట్యునీషియా, కువైట్ దేశాల్లో దాడులకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ప్రకటించింది. ఆ దాడులకు బాధ్యత తమదేనంటూ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ట్యునీషియాలో దాడికి పాల్పడ్డ సాయుధుడు అబు యాహ్యా అల్ ఖైర్వానీ అని, అతడు ఖలీఫా సామ్రాజ్య సైనికుడు అని పేర్కొంది. తమ గ్రూపుకు శత్రువులుగా పరిణమించిన వ్యక్తులను, స్వధర్మ వ్యతిరేకులను, వివాహేతర సంబంధాలకు మొగ్గుచూపుతున్నవారిని, చెడు మార్గంలో పయనిస్తున్నవారిని అతడు లక్ష్యంగా చేసుకున్నాడని ఐఎస్ తెలిపింది. ట్యునీషియాలో శుక్రవారం ఓ హోటల్ పై దాడి జరగడం తెలిసిందే. ఆ దాడిలో 38 మంది మరణించారని దేశ ప్రధాని హబీబ్ ఎస్సిద్ తెలిపారు. ఇక, కువైట్ లోని షియా వర్గానికి చెందిన మసీదుపై జరిగిన దాడిలో 27 మంది మరణించారు.