: ఛత్తీస్ గఢ్ లో నక్సలిజాన్ని మించిన సమస్య మరొకటి ఉంది!


భారత్ లో నక్సలిజం కారణంగా అత్యధికంగా ప్రభావితమవుతున్న రాష్ట్రం ఛత్తీస్ గఢ్. అలాంటి రాష్ట్రంలో నక్సలిజాన్ని మించిన సమస్య మరొకటి ఉంది. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన ఎయిడ్స్ మహమ్మారి ఇప్పుడు చాలాచోట్ల శాంతించినా, ఛత్తీస్ గఢ్ లో మాత్రం కరాళ నృత్యం చేస్తూనే ఉంది. హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నానాటికీ పెరిగిపోతుండడం పట్ల అక్కడి సర్కారును తీవ్ర ఆందోళన చెందుతోంది. గడచిన రెండేళ్లలో ఛత్తీస్ గఢ్ లో 2500 మంది హెచ్ఐవీ సోకిన కారణంగా ప్రాణాలు విడిచారు. వైరస్ సోకిన విషయాన్ని సకాలంలో గుర్తించలేకపోవడం, సరైన మందులు వాడకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం వంటి కారణాలతో వారు మృత్యువాత పడ్డారని స్వచ్ఛంద సంస్థలు తెలిపాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మావోయిస్టు దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య కంటే హెచ్ఐవీ సోకి చనిపోయిన వారి సంఖ్యే అధికంగా ఉందట.

  • Loading...

More Telugu News