: రేవంత్ సస్పెన్షన్ కు రంగం సిద్ధం... టీఆర్ఎస్ వర్గాల్లో జోరందుకున్న చర్చ!


ఓటుకు నోటు కేసులో సీక్రెట్ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయిన టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు తెలంగాణ సర్కారు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ‘‘సస్పెన్షన్ అయితే ఖాయం... ఎంతకాలం విధించాలన్న దానిపైనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే, రేవంత్ సస్పెన్షన్ పై తీర్మానం ప్రవేశపెట్టాలని కేసీఆర్ సర్కారు భావిస్తోంది. ఈలోగా రేవంత్ కు బెయిల్ వచ్చినా, ఆయనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోందట. అయితే ఓటుకు నోటు వివాదం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో రేవంత్ పై చర్య తీసుకుంటే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? అన్న విషయంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈ విషయంలో న్యాయ నిపుణుల నుంచి అభిప్రాయాలను తీసుకుని ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News