: భూసేకరణ చట్టంపై మా వైఖరిలో మార్పులేదు: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భూసేకరణ చట్టంపై తమ వైఖరి మరోసారి బలంగా చాటారు. భూసేకరణ బిల్లు విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. కార్పొరేట్ల ఉద్ధరణ కోసం పేదల నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు ఉపకరించే బిల్లుకు తమ పార్టీ (తృణమూల్ కాంగ్రెస్) మద్దతివ్వబోదని తెగేసి చెప్పారు. భూములు లాక్కుని, ఆ భూములకు ఎస్ఈజెడ్ హోదా ఇవ్వడానికి తాము వ్యతిరేకమని పునరుద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్ లో పరిశ్రమలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని, కానీ, ఎస్ఈజెడ్ హోదా మాత్రం కల్పించబోమని తెలిపారు. ఓ టీవీ చానల్ కార్యక్రమంలో ఆమె పైవిధంగా పేర్కొన్నారు.