: మరో ఏడాది పాటు కెప్టెన్ నేనే!: మెక్ కల్లమ్


మరో ఏడాది పాటు న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్ తానేనని బ్రెండన్ మెక్ కల్లమ్ తెలిపాడు. వరల్డ్ కప్ లో కివీస్ జట్టును విజయపథంలో నిలిపిన మెక్ కల్లమ్, ప్రపంచ కప్ తరువాత ఆ జోరు కొనసాగించలేకపోయాడు. వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తరువాత కివీస్ కోలుకోలేదు. ఇంగ్లండ్ తో జరిగిన టీట్వంటీ, వన్డే సిరీస్ లలో దారుణంగా ఓడిపోయింది. దీంతో మెక్ కల్లమ్ కెప్టెన్సీపై విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ సెలెక్టర్లు మెక్ కల్లమ్ పై నమ్మకముంచారు. దీంతో మరో ఏడాది కెప్టెన్ గా మెక్ కల్లమ్ కొనసాగనున్నాడు. అయితే ఈ ఏడాది అద్భుత ప్రదర్శన కనబరిచిన న్యూజిలాండ్ జట్టు, రానున్న కాలంలో క్లిష్టమైన ప్రత్యర్థులను ఎదుర్కొనుందని చెప్పాడు. ఆసీస్, భారత్ తో న్యూజిలాండ్ సిరీస్ ఉండడంతో మెక్ కల్లమ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

  • Loading...

More Telugu News