: 'అరే యార్'... ఇప్పుడీ పదం ఆక్స్ ఫర్డ్ డిక్షనరీకెక్కింది!
నికార్సైన నిఘంటువుగా ఆక్స్ ఫర్డ్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ఆక్స్ ఫర్డ్ నిఘంటువులో ప్రతి ఏడాది కొత్త పదాలను చేర్చుతుంటారు. దాదాపు అన్ని భాషలకు సంబంధించి బాగా ప్రాచుర్యంలో ఉన్న పదాలను ఎంపిక చేసి వాటిని డిక్షనరీలో పొందుపరుస్తారు. భారతీయ భాషలకు చెందిన పదాలు కూడా ఆక్స్ ఫర్డ్ లో చోటుచేసుకున్నాయి. తాజాగా, భారత్ లో విరివిగా ఉపయోగించే 'అరే యార్', 'చుడీదార్', 'ధాబా', భేల్ పురి పదాలను, వాటి అర్థాలు సహా ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చేర్చారు. ఈ పర్యాయం దాదాపు ఐదు వందల కొత్త పదాలకు ఈ నిఘంటువులో చోటు కల్పించడం విశేషం.