: ఆరోగ్యం, ఆహారంపై పుస్తకం రాయనున్న బాలీవుడ్ నటి


గతంలో యోగా అంటూ హల్ చల్ చేసిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి పుస్తకం రాయనుంది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న శిల్పాశెట్టి మాట్లాడుతూ, భారతీయ ఆహారం, పోషక విలువలకు సంబంధించి ఓ పుస్తకం రాయనున్నానని తెలిపింది. ఆరోగ్య సాధనలో పౌష్టికాహారానిది ప్రముఖ పాత్ర అని పేర్కొన్న శిల్పా శెట్టి, ఆహారంపై పుస్తకం రాయడం ఆసక్తి కలిగిస్తోందని వెల్లడించింది. ప్రస్తుత తరం భారతీయ ఆహారంలోని పోషక విలువలు మర్చిపోతున్నారని, మన ఆహారం ఎప్పుడు, ఎలా తినాలో తెలుసుకోవాలని ఆమె సూచించింది. యోగా తన జీవితాన్ని మార్చేసిందని శిల్పా శెట్టి తెలిపింది.

  • Loading...

More Telugu News