: మధ్నాహ్న భోజనంతో పాలు అందించండి: కేంద్ర మంత్రి


ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్నాహ్న భోజనంతో పాటు పాలు కూడా అందించాలని తమిళనాడు, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ సూచించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు. విద్యార్థుల్లో పోషకాల స్థాయిని పెంచేందుకు పాలు అవసరమని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని మిల్క్ ఫెడరేషన్లు, కో-ఆపరేటివ్ సంస్థల వద్ద అధికమొత్తంలో పాలపొడి, పాల ఉత్పత్తులు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News