: రాజమౌళికి కేటీఆర్ కితాబు


తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు శుక్రవారం ట్విట్టర్ లో లైవ్ చాటింగ్ చేశారు. ప్రజలు అడిగిన అనేక ప్రశ్నలకు ఆయన ఓపికగా జవాబులిచ్చారు. ఈ సందర్భంగా అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ... తనకు సినిమాలంటే చాలా ఇష్టమని తెలిపారు. నచ్చిన దర్శకుడు రాజమౌళి అని, ఆయన ఓ అద్భుతమైన దర్శకుడని కితాబిచ్చారు. ఇక, ఓటుకు నోటు వ్యవహారంలో బాస్ అరెస్టు ఎప్పుడంటూ చాలామంది నెటిజన్లు కేటీఆర్ ను ప్రశ్నించారు. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన జవాబిచ్చారు. 'వీ ఆర్ హైదరాబాద్' పేరిట నిర్వహించిన ఈ లైవ్ చాట్ షోలో అధిక శాతం ప్రశ్నలు ఓటుకు నోటు అంశానికి సంబంధించినవే ఉన్నాయట.

  • Loading...

More Telugu News