: జైలులో ఖైదీలు మమ్మల్ని కొట్టేవారు: ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తు చేసుకున్న స్టాలిన్


రాజకీయ నాయకులు ఎవర్ని కదిపినా ఎమర్జెన్సీ రోజుల జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతున్నారు. ఎమర్జెన్సీ కాలంలో తమను జైలులో వేశారని డీఎంకే కోశాధికారి స్టాలిన్ తెలిపారు. 1975లో ఎమర్జెన్సీ విధించినప్పుడు తనను, మురసోలి మారన్ ను, మరో 120 మందిని చెన్నైలోని సెంట్రల్ జైల్లో వేశారని గతం గుర్తుచేసుకున్నారు. జైలులో జైలర్ తమను జీవిత ఖైదు పడ్డ ఖైదీలతో మూడు నెలల పాటు కొట్టించారని తెలిపారు. డీఎంకే ఎంపీ చిట్టిబాబు కారణంగా తాము బతికిపోయామని, జైల్లో తిన్న దెబ్బల కారణంగా ఆయన మృత్యువాత పడ్డారని తెలిపారు. ఎమర్జెన్సీ కాలంలో ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించామని స్టాలిన్ చెప్పారు.

  • Loading...

More Telugu News