: అమర్ నాథ్ యాత్రలో శీతల పానీయాలు, జంక్ ఫుడ్ అమ్మకాలు నిషేధం


అమర్ నాథ్ యాత్రలో శీతల పానీయాలు, జంక్ ఫుడ్ అమ్మకాలను ఈ ఏడాది నుంచి తప్పనిసరిగా శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డు పూర్తిగా నిషేధిస్తోంది. ఇక్కడకు వచ్చే భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 2012లో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనను ఆలయ బోర్డు కఠినంగా అమలుచేయబోతోంది. దానిపై ఆలయ బోర్డు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పంకజ్ ఆనంద్ మాట్లాడుతూ, "దానికి సంబంధించి 2012లో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అందుకే అమర్ నాథ్ గుహ మందిరం చేరుకునే దారిలో శీతల పానీయాలు, జంక్ ఫుడ్ ను అమ్మడంగానీ, వినియోగించడంగానీ పూర్తిగా నిషేధిస్తున్నాం" అని తెలిపారు. ఎందుకంటే యాత్ర సమయంలో అటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల సరైన ఆక్సిజన్ సరఫరాలేక జీర్ణం కాదని, దానివల్ల శ్వాస సంబంధిత సమస్య తలెత్తి యాత్ర మరింత కష్టమవుతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. 2012లో పెద్దసంఖ్యలో భక్తులు చనిపోయిన నేపథ్యంలో కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఈ మేరకు చేసిన సూచనతో యాత్రలో వాటి అమ్మకాలను చేయవద్దని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News