: జులై 2 నుంచి ఏపీలో ఇంజనీరింగ్ క్లాసులు: మంత్రి గంటా
ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పూర్తయిందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. జులై 2 నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. గతంలో సెప్టెంబర్, అక్టోబర్ లో క్లాసులు మొదలయ్యేవని, కానీ ఈసారి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం వల్లనే జులైలోనే ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయని గంటా పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎంసెట్ ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఖరారైనట్టు ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 73,072 సీట్లు భర్తీ చేశామని, ఏడు కళాశాలల్లో విద్యార్థులు చేరలేదని చెప్పారు. త్వరలో రెండో విడత కౌన్సెలింగ్ తేదీలు వెల్లడిస్తామన్నారు.