: బోస్టన్ పేలుళ్ల మృతులకు పార్లమెంట్ సంతాపం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు తిరిగి ప్రారంభమయ్యాయి. బోస్టన్ పేలుళ్లలో మరణించిన వారికి లోక్ సభ సంతాపం ప్రకటించింది. అలాగే బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ మృతికి రాజ్యసభ నివాళులు అర్పించింది. ఇక ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన కిరాతక లైంగిక దాడిని పార్లమెంట్ ఉభయ సభలు ముక్తకంఠంతో ఖండించాయి.