: కువైట్ లోని షియా మసీదుపై ఆత్మాహుతి దాడి
కువైట్ రాజధాని కువైట్ సిటీలో ఉన్న ఓ షియా మసీదుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 13 మంది చనిపోయారు. శుక్రవారం నాటి ప్రార్థనలు జరుగుతున్న సందర్భంగా ఈ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ఐఎస్ ప్రకటించుకుంది. సోషల్ మీడియా ద్వారా ఈ మేరకు ఇస్లామిక్ మిలిటెంట్లు స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇటీవల సౌదీ అరేబియా, యెమెన్ దేశాల్లోని షియా మసీదులపై జరిగిన దాడులకు కూడా తామే బాధ్యులమని ఐఎస్ఐఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.