: మత్తయ్య కాల్ డేటా వివరాలు తీసుకునేందుకు ఏపీ సీఐడీకి అనుమతి


ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య కాల్ డేటా వివరాలు తీసుకునేందుకు విజయవాడ స్థానిక కోర్టు ఏపీ సీఐడీకి అనుమతినిచ్చింది. ఈ మేరకు కాల్ డేటా వివరాలు ఇవ్వాలని ఎయిర్ టెల్, ఐడియా, రిలయన్స్ సంస్థలను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో మూడు సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. మూడు సర్వీస్ ప్రొవైడర్ల నుంచి కాల్ డేటా వివరాల కోసం సీఐడీ దాఖలుచేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు పైవిధంగా స్పందించింది. ఈ నేపథ్యంలో మత్తయ్య, అతని భార్య, సోదరుడి ఎయిర్ టెల్, ఐడీయా, రిలయన్స్ నెంబర్ల కాల్ డేటాలను ప్రొవైడర్లు సీఐడీకి ఇవ్వనున్నారు.

  • Loading...

More Telugu News