: నటితో సెల్ఫీలు పైలట్ల కొంపముంచాయి!
స్మార్ట్ ఫోన్ల రంగప్రవేశంతో సెల్ఫీల సంస్కృతి విస్తృతమైంది. సెల్ఫీల మోజుతో యువత కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా విదితమే. తాజాగా, అర్జెంటీనాకు చెందిన ఓ విమానయాన సంస్థ పైలెట్లు ఈ సెల్ఫీల కారణంగానే సస్పెన్షన్ కు గురయ్యారు. బ్యూనస్ ఎయిర్స్-రోసారియా మధ్య విమానం గాల్లో ఉండగా ఓ నటితో ఫొటోలకు పోజులిచ్చినట్టు తేలడంతో యాజమాన్యం వారిపై వేటు వేసింది. వికీ జిపోలిటాకిస్ అనే అందాల తార విమానం కాక్ పిట్ లో ప్రవేశించి పైలట్, కో-పైలట్ ను కవ్వించింది. ఆమె అందచందాలకు వారు ఫ్లాటైపోయారు. హుషారెక్కువైన వారిద్దరూ ఆమెతో పోటీలు పడి ఫొటోలకు పోజులిచ్చారు. ఆ ఫొటోలను అమ్మడు ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. ఈ ఫొటోలను మీడియా విశేషంగా ప్రసారం చేయడంతో, వారి నిర్వాకం సదరు విమానయాన సంస్థ దృష్టిలో పడింది. దాంతో, వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. తదుపరి విచారణకు ఆదేశించింది.