: తెలంగాణకు అవసరమైన చమురును కేంద్రం అందిస్తుంది: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్
తెలంగాణలో రూ.1300 కోట్లతో పెట్రోల్ సంబంధిత అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. తెలంగాణకు అవసరమైన చమురును కేంద్రం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. తూర్పు నుంచి దక్షిణానికి (ఈస్ట్ టు సౌత్) కొత్త పైప్ లైన్ వేస్తామని, ఒడిశాలోని పారాదీప్ నుంచి హైదరాబాద్ వరకు కొత్త పైన్ లైన్ ఉంటుందని మంత్రి వివరించారు. పెట్రో సంబంధ అంశాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలతో సుదీర్ఘంగా చర్చించానన్నారు. ప్రతి మహిళ గ్యాస్ తోనే వంట చేసుకునేలా ఎల్పీజీ కనెక్షన్లను పెంచుతున్నామని తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మంత్రి పర్యటిస్తున్న విషయం తెలిసిందే.