: బైక్ వద్దు... డబ్బులే కావాలన్న శిఖర్ ధావన్
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మన్ గా నిలిచాడు. మూడు మ్యాచ్ లు ఆడి 52.66 సగటుతో ధావన్ 158 పరుగులు చేశాడు. వాటిలో రెండు ఫిఫ్టీలున్నాయి. చివరి వన్డేలో 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ధావన్ బ్యాటింగ్ ప్రదర్శనకు గాను ఓ మోటార్ బైక్ ను ప్రదానం చేయాలనుకుంది బంగ్లా క్రికెట్ బోర్డు. అయితే, ధావన్ తనకు బైక్ వద్దని, అందుకు సమానమైన నగదు ఇవ్వాలని కోరాడట. దీంతో, చివరి వన్డే అనంతరం బహుమతి ప్రదానోత్సవంలో ఈ డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ కు ఓ డమ్మీ కీ బహుకరించారు. దీనిపై శిఖర్ ధావన్ తండ్రి మహేంద్ర పాల్ ధావన్ మాట్లాడుతూ... శిఖర్ కెరీర్ తొలినాళ్లలో బైక్ లు నడపడాన్ని ఇష్టపడేవాడని, ఇప్పుడు టూ వీలర్స్ అంటే పెద్దగా ఇష్టపడడంలేదని వివరించారు. కుటుంబం ఉంది కాబట్టి, కారు అయితే అతడికి బాగా ఉపయుక్తంగా ఉండేదని అన్నారు.