: రేవంత్ ఒక్క ఎమ్మెల్యేను కొనాలనుకున్నారు... 10 మందిని కొంటే ప్రభుత్వమే పడిపోయేది: అడ్వొకేట్ జనరల్


ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే విచారణ ముందుకు సాగదని అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి హైకోర్టుకు తెలిపారు. రూ. 50 లక్షలు రేవంత్ కు ఎక్కడ నుంచి వచ్చాయో తేలాల్సి ఉందని... ఈ కేసులో ఇంకా చాలా మందిని విచారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు మత్తయ్య జరూసలెం రూ. 2 కోట్లు ఆఫర్ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ స్థానాలకు ఎంతమంది పోటీ చేశారని జడ్జి ప్రశ్నించారు. ఆరు స్థానాలకు ఏడు మంది పోటీ చేశారని ఏజీ సమాధానమిచ్చారు. రేవంత్ రెడ్డి ఒక్క ఎమ్మెల్యేని కొనాలని చూశారని, 10 మందిని కొంటే ప్రభుత్వమే పడిపోయేదని కోర్టుకు తెలిపారు. ఈ సమయంలో, బెయిల్ పై రేవంత్ రెడ్డి బయటకు వస్తే సాక్షులను, సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారని చెప్పారు. ఎమ్మెల్యేలకు లంచం ఇవ్వడం నేరమని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కేసులో కోర్టు తెలిపిందని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News