: రాజకీయ రాబందు కేసీఆర్: ఎల్.రమణ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ రాబందుగా మారారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఎద్దేవా చేశారు. తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని స్పీకర్ ను రమణ కోరారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే ఏకంగా మంత్రి అయిపోయారని, వారిపై చర్య తీసుకోవడానికి స్పీకర్ కు ఇబ్బందేమిటని ప్రశ్నించారు. ఇలాంటి వాటిపై స్పీకర్ దృష్టి సారించకపోవడంతోనే, కేసీఆర్ రాజకీయ రాబందులా మారి ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను తన పార్టీలోకి లాక్కొంటున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News