: రేవంత్ బెయిల్ పిటిషన్ పై వాదనలు ప్రారంభం
టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఆయన తరపున న్యాయవాది సిద్ధార్థ లూధ్రా వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు, రేవంత్ రెడ్డికి బెయిల్ ఇవ్వరాదని, ఆయన చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి అని, ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే, బయటకు వచ్చి సాక్షులను, సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఏసీబీ లాయర్లు వాదిస్తున్నారు. కాసేపట్లో రేవంత్ కు బెయిల్ వస్తుందా? లేదా? అన్న విషయం తేలిపోనుంది.