: ప్రముఖ గజల్ గాయకుడు విఠల్ రావు కన్నుమూత


ప్రముఖ గజల్ గాయకుడు విఠల్ రావు మృతి చెందారు. గత నెల 29న షిరిడీలో సాయిబాబా దర్శనం కోసం వెళ్లిన ఆయన అల్జీమర్స్ తో తప్పిపోయారు. దాంతో షిరిడీ మొత్తం కుటుంబ సభ్యులు వెతకగా చివరికి హైదరాబాద్ లోని బేగంపేట రైల్వేఫ్లాట్ ఫాంపై ఆయన మృతదేహం దొరికింది. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. కొంతకాలంగా అల్జీమర్స్ వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ఈ నెల 2న విఠల్ కు తెలంగాణ ప్రభుత్వం సన్మానం చేయాలనుకుంది. ఆయన మృతి పట్ల సీఎం కేసీఆర్, పలువురు సాహితీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నిజాం ఆస్థానంలో విఠల్ రావు చివరి గాయకుడు. ఉర్దూ, పర్షియన్, హిందీ, సంస్కృత భాషల్లో గజల్స్ తో ఆయన గుర్తింపు పొందారు.

  • Loading...

More Telugu News