: కృష్ణా జిల్లా ఫైనాన్సియర్ తో రేవంత్ తరచూ ఫోన్ సంభాషణ...కాల్ డేటా చెబుతోందన్న టీ ఎసీబీ


ఓటుకు నోటు కేసులో అరెస్టైన టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డికి సంబంధించిన మరో కీలక సమాచారం తమ చేతికి చిక్కిందని తెలంగాణ ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అమీర్ పేటలో స్థిిరపడ్డ ఓ ఫైనాన్సియర్ తో రేవంత్ రెడ్డి తరచూ ఫోన్ లో మాట్లాడారని, రేవంత్ కాల్ డేటా పరిశీలనతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని వారు చెబుతున్నారు. సదరు ఫైనాన్సియర్ ను కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తిగా ఏసీబీ అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టైన నేపథ్యంలో సదరు ఫైనాన్సియర్ ను కూడా ప్రశ్నించేందుకు ఏసీబీ సమాయత్తమవుతోంది.

  • Loading...

More Telugu News