: ప్రియాంకా, రాబర్ట్ వాద్రాలనూ కలిశా... మరో బాంబు పేల్చిన లలిత్ మోదీ
ఐపీఎల్ అక్రమార్కుడు లలిత్ మోదీ మరో బాంబు పేల్చాడు. ఆర్థిక నేరాలకు పాల్పడి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సహాయంతో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీ, సంచలన విషయాలకు తెర తీశాడు. లలిత్ మోదీ ప్రకటనలతో సుష్మాతో పాటు రాజస్థాన్ సీఎం వసుందర రాజే కూడా చిక్కుల్లో పడ్డారు. ఈ వివాదం మోదీ సర్కారుకు గుదిబండగానే మారింది. తాజాగా లలిత్ మోదీ కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెట్టే ప్రకటన చేశాడు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కూతురు ప్రియాంకా గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రాలను కూడా తాను లండన్ హోటల్లో కలిశానని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. దీంతో నిన్నటి దాకా ఆత్మరక్షణలో పడ్డ బీజేపీ, లలిత్ మోదీ తాజా వ్యాఖ్యలతో కాంగ్రెస్ పై ఎదురుదాడికి సన్నాహాలు చేస్తోంది.