: కేంద్ర హోంశాఖ మంత్రి, కార్యదర్శులతో ముగిసిన గవర్నర్ భేటీ... సాయంత్రానికి హైదరాబాద్ కు రానున్న నరసింహన్
ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంశాఖ కార్యదర్శులతో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సమావేశం ముగిసింది. ఉదయం తొలిసారి హోంశాఖ కార్యదర్శులు ఎన్.సీ.గోయల్, అలోప్ కుమార్ లతో సమావేశమై గవర్నర్ ఓటుకు నోటు, సెక్షన్ 8 అంశాలపై విపులంగా చర్చించారు. తరువాత రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన సెక్షన్ 8పై స్పష్టత కోరారు. ఆ తరువాత హోంశాఖ అధికారులతో వెంటవెంటనే సమావేశమైన గవర్నర్ అన్నిసార్లు ఏ విషయాలపై చర్చించారన్నది తెలియాల్సి ఉంది. అనంతరం బయటికి వచ్చిన గవర్నర్ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే ఇంకెవరినీ తాను కలవడంలేదని, వెంటనే హైదరాబాద్ వెళుతున్నట్టుగా చెప్పేసి వెళ్లిపోయారు.