: 1930 నాటి తీవ్ర మాంద్యంలోకి వెళ్లే ప్రమాదం: బాంబు పేల్చిన ఆర్బీఐ గవర్నర్ రాజన్


1930లో ఏర్పడిన ప్రపంచ ఆర్థిక మాంద్యం మరోసారి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, బ్యాంకింగ్ రంగం తక్షణం స్పందించకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. లండన్ బిజినెస్ స్కూల్లో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పలు దేశాల బ్యాంకులు పోటీ పడుతూ పరపతి సమీక్షలు జరుపుతూ, విధాన నిర్ణయాలను సరళీకరిస్తూ సాగడం ప్రమాదహేతువని ఆయన అన్నారు. అయితే, ఇండియాలో పరిస్థితి వేరుగా ఉందని రాజన్ అభిప్రాయపడ్డారు. 85 ఏళ్ల నాటి కష్టాల్లోకి ప్రపంచం జారకముందే, ఆర్థికవేత్తలు చర్చించి పరిస్థితులు చక్కబరచాలని ఆయన సలహా ఇచ్చారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో జరగాల్సిన పని కాబట్టి ఎలా ముందుకు వెళ్లాలన్నది, కొత్త నిబంధనలు ఎలా ఉండాలన్న విషయంలో తానేమీ వ్యాఖ్యానించబోనని అన్నారు. ఇదే సమయంలో గతం మరోసారి రిపీట్ అవుతుందేమోనన్న భయం వెంటాడుతోందని అన్నారు.

  • Loading...

More Telugu News