: పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి విద్యార్థులకు సెలవులు
జులై నెలలో గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలోని పలు పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో పుష్కర ఘాట్ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించనున్నారు. జులై 14 నుంచి 25 వరకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుష్కరాల సమయంలో వేల సంఖ్యలో ప్రజలు వస్తారు కాబట్టి విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే ఈ సమయంలో సూళ్ల ఆవరణను ప్రభుత్వం పుష్కర అవసరాలకు వినియోగించుకోనుందట.