: బీజేపీ ఎవరినీ క్షమించదు...ఎవరినీ రక్షించదు:‘ఓటుకు నోటు’పై సోము వీర్రాజు వ్యాఖ్య
తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన ‘ఓటుకు నోటు’పై బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అటు మిత్రపక్షాలతో పాటు ఇటు విపక్షాలను కూడా ఆలోచనలో పడేశాయి. ఓటుకు నోటు కేసుపై బీజేపీకి స్పష్టత ఉందని ఈ సందర్భంగా వీర్రాజు వ్యాఖ్యానించారు. ఈ కేసులోనే కాక ఏ కేసులోనైనా తమ పార్టీ ఎవరినీ క్షమించదని చెప్పిన ఆయన, ఏ ఒక్కరిని కూడా రక్షించదని అన్నారు. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి పీఠం ఎక్కినా ఇంకా ఉద్యమనేతగానే వ్యవహరిస్తున్నారని తేల్చేశారు. ఇక ఏపీలో అమలవుతున్న నిరంతర విద్యుత్ ఘనత కేంద్రంలోని బీజేపీ సర్కారుదేనని ఆయన చెప్పుకొచ్చారు.