: హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేసి, యూటీ చేయాలి: ఉండవల్లి
హైదరాబాద్ ను శాశ్వతంగా ఉమ్మడి రాజధాని చేయాలన్న డిమాండ్ ను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ క్రమంలో హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేసి, యూటీ చేయాలని కోరారు. ఇప్పటికైనా టీడీపీకి సెక్షన్ 8 గుర్తుకురావడం సంతోషకరమని ఆయన అన్నారు. విభజన చట్టంలో సెక్షన్ 8 స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్ లో విభజన బిల్లు చట్ట ప్రకారం పాస్ అవలేదని, దీనిపై సుప్రీంకోర్టులో తాను న్యాయపోరాటం సాగిస్తున్నానని ఉండవల్లి తెలిపారు.