: కుక్క అరుపులకు పరుగులు పెట్టిన చిరుత... యూట్యూల్ లో వీడియో హల్ చల్!


కుక్క అరుపులకు చిరుత పులి జడిసి పారిపోవడమేంటనేగా మీ అనుమానం? అయితే యూట్యూబ్ ఓపెన్ చేయండి. ‘డాగ్ చేజింగ్ లెపర్డ్ ముంబై’ అని టైప్ చేయండి. ఓ వీడియో ప్రత్యక్షమవుతుంది. ఈ వీడియోను చూస్తే పైన చెప్పిన విషయం నిజమేనని మీరే ఒప్పుకుంటారు. ఎందుకంటే, ఆ వీడియోలో ఓ కుక్క, చిరుత పులిని వెంటాడి పరుగులు పెట్టిస్తోంది. మహారాష్ట్ర రాజధాని ముంబై శివారు ప్రాంతానికి చెందిన ఓ అపార్ట్ మెంట్ లో నిన్న రాత్రి ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. సదరు అపార్ట్ మెంట్ కు అమర్చిన సీసీటీవీలో ఈ ఆసక్తికర సన్నివేశం రికార్డైంది. ప్రస్తుతం యూట్యూబ్ లోకి చేరిన ఈ వీడియోను నెటిజన్లు ఆసక్తికరంగా తిలకిస్తున్నారు. వివరాల్లోకెళితే... రాత్రి 2 గంటల సమయంలో అందరూ నిద్రిస్తుండగా, అపార్ట్ మెంట్ లోని ఓ ఇంటి ముందు తన యజమాని కుటుంబానికి కాపలా కాస్తున్న కుక్క కూడా గాఢనిద్రలోకి జారుకుంది. అదే సమయంలో బాగా ఆకలితో నకనకలాడుతున్న ఓ చిరుతపులి అక్కడ ప్రత్యక్షమైంది. ఇంటిలొోపలికి వెళ్లి కుక్కను పీక్కుతిందామంటే గ్రిల్స్ అడ్డంగా ఉన్నాయి. ఇనుముతో చేసిన సదరు గ్రిల్స్ అంత ఈజీగా ఊడలేదు. దీంతో ఆగ్రహంతో గాండ్రించిన చిరుత అరుపులకు నిద్ర మేల్కొన్న కుక్క పారిపోవడం మరిచిపోయింది. చిరుతపై ఎదురుతిరిగింది. పెద్ద శబ్ధం చేస్తూ అరవడం మొదలెట్టింది. దీంతో కుక్క అరుపులకు జడిసిన చిరుత పలాయనం చిత్తగించింది. అయితే అరుపులతో సరిపెట్టని కుక్క, చిరుతను అల్లంత దూరం వరకు వెంటాడి పరుగులు పెట్టించింది.

  • Loading...

More Telugu News