: భర్త హింసిస్తున్నాడంటున్న టీవీ నటి
షలీన్ బానోత్, దల్జీత్ కౌర్... ఇద్దరూ టీవీ నటులే. ప్రేక్షకుల్లో మంచి జంటగా, అంతకుమించి అద్భుతమైన స్టెప్పులతో డ్యాన్సులేసే భార్యాభర్తలుగా సుపరిచితులే. అంతే కాదు, 'నాచ్ బలీయే' సీజను 4లో విజేతలు కూడా. ఇదంతా బుల్లి తెరపై మాత్రమే. తెరవెనుక దాగున్న మరో కోణాన్ని దల్జీత్ బయటపెట్టింది. షలీన్ తనను గృహ హింసకు గురి చేస్తున్నాడని దల్జీత్ ఆరోపిస్తోంది. షలీన్ పెట్టే హింస తట్టుకోలేక తన కొడుకు షారవ్ తో కలసి బెంగళూరులోని తల్లిదండ్రుల వద్ద ఆశ్రయం పొందుతున్నానని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. షలీన్ మరో మహిళతో సన్నిహితంగా ఉండడం చూసి ప్రశ్నించగా, తనను వేధించడం మొదలు పెట్టాడని తెలిపింది. తనకు న్యాయం జరగాలని, షలీన్ కు శిక్ష పడాలని కోరుకుంటున్నట్టు దల్జీత్ వివరించింది.