: అవన్నీ ఊహాగానాలే: గంగూలీ
బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా కోల్పోవడంతో విమర్శకులు నోటికి పని చెప్పారు. భారత జట్టులో ఆధిపత్య పోరు నడుస్తోందని, అందువల్లే బంగ్లాదేశ్ లాంటి జట్టుపై కూడా ఓటమిపాలైందని వారంతా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వార్తలపై బీసీసీఐ సలహామండలి సభ్యుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. జట్టు ఓటమిపాలైనప్పుడు, స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చనప్పుడు ఇలాంటి వార్తలు వస్తుంటాయని... వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టి పారేశాడు. ధోనీకి, కోహ్లీకి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందన్న వార్తలన్నీ ఊహాగానాలే అని చెప్పాడు. బంగ్లాదేశ్ తో ఇండియా ఓడిపోవడం బాధాకరమే అయినప్పటికీ, బంగ్లాదేశ్ బాగా ఆడిందని కితాబిచ్చాడు.