: నేను రాజీనామా చేస్తా, కానీ...!: వసుంధరా రాజే మెలిక!


ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి సహకారమందించి చిక్కుల్లో పడ్డ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే తన పదవిని కాపాడుకోవడానికి మరో అస్త్రాన్ని వదిలారు. ఆమె రాజీనామా చేయాలన్న డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో స్పందించారు. తాను రాజీనామా చేయడానికి సిద్ధమేనని, అయితే, ఈ వివాదంతో సంబంధమున్న అందరూ పదవులను వీడాలని ఆమె మెలికపెట్టారు. ఇదే విషయాన్ని ఆమె బీజేపీ పెద్దలకు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో కాస్తంత వెనక్కు తగ్గిన పార్టీ నేతలు ప్రస్తుతానికి రాజీనామా విషయాన్ని పక్కనబెట్టినట్టు సమాచారం. ఈ కేసులో సుష్మా స్వరాజ్ సైతం ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుష్మా, వసుంధరలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

  • Loading...

More Telugu News