: గెలిస్తే ‘ఒబామా కేర్’కు చెల్లుచీటే...అమెరికా అధ్యక్ష బరిలోకి దూకిన బాబీ జిందాల్
అమెరికా రాజకీయాల్లో సత్తా చాటుతున్న భారత సంతతి పారిశ్రామికవేత్త బాబీ జిందాల్ ఆ దేశ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దూకేశారు. లూసియానా గవర్నర్ గా ఉన్న బాబీ జిందాల్, ఆ రాష్ట్రంలోని న్యూఓర్లిన్స్ నగరంలో నిన్న లాంఛనంగా తన ప్రచారాన్ని ప్రారంభించారు. తనను తాను కార్యసాధకుడిగా చెప్పుకున్న జిందాల్, ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా సహా తాజాగా అధ్యక్ష బరిలో నిలిచిన వారినందరినీ మాటకారులుగా అభివర్ణించారు. ఒబామా ప్రసంగాలతో అమెరికాకు ఒరిగిందేమీ లేదని కూడా తన పదునైన మాటలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల్లో తనను గెలిపిస్తే, దేశంలో పెద్ద వివాదానికి తెరతీసిన ఒబామా హెల్త్ కేర్ పాలసీ ‘ఓబామా కేర్’ను అటకెక్కిస్తానని కూడా జిందాల్ ప్రకటించారు.