: గవర్నర్ వరుస భేటీలు షురూ...కేంద్ర హోం శాఖ అధికారులతో సమావేశమైన నరసింహన్
కేంద్రం ఆదేశాలతో నిన్న రాత్రికే ఉన్నపళంగా ఢిల్లీ చేరిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొద్దిసేపటి క్రితం కార్యరంగంలోకి దూకేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆరని చిచ్చు రగిల్చిన ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 లపై ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. అధికారులతో భేటీ ముగియగానే ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోనూ భేటీ కానున్నారు. ఆ తర్వాత అపాయింట్ మెంట్ చిక్కితే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో కూడా సమావేశం కానున్నారు.