: నేడు పాకిస్థాన్ తో భారత్ ఢీ
మరో కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. దాయాది హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్ పోరులో భాగంగా, నేడు భారత పురుషుల జట్టు పాకిస్థాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకు లీగ్ లో తేలికైన డ్రా దక్కనుంది. భువనేశ్వర్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ తర్వాత భారత్, పాకిస్థాన్ హాకీ జట్లు తలపడడం ఇదే తొలిసారి కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.