: డిగ్రీలే నకిలీవి... ఆమె నకిలీ కాదు కదా?: స్మృతిపై జోకేసిన లాలూ


కేంద్ర మంత్రుల డిగ్రీలు నకిలీవని, అసలు మోదీ సర్కారే నకిలీదని ఆర్ జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ డిగ్రీలు నకిలీవి కావచ్చు కానీ, ఆమె మాత్రం నకిలీ కాదు కదా? అని ఆయన ప్రశ్నించారు. స్మృతి విద్యార్హతలపై దాఖలైన కేసును ఢిల్లీ కోర్టు విచారణకు స్వీకరించడంపై లాలూ స్పందిస్తూ, "డిగ్రీలతో చేసేదేముంది? ఇరానీ నిజంగా ఉన్నారు. ఆమె ఒక స్త్రీ. ఆమెను 'సాస్ భీ కభీ బహూ థీ' టీవీ సీరియల్లో చూశాము" అని వ్యాఖ్యానించారు. ఆమె తనను చాలా గౌరవిస్తుందని కూడా అన్నారు.

  • Loading...

More Telugu News