: రోడ్డు పక్కన నిలబడితే, అంబులెన్సే మృత్యుశకటమైంది!
ఏవైనా ప్రమాదాలు జరిగితే ఆపద్బంధులా వచ్చి ఆదుకుని, క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్సను అందించి, సమయానికి ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే అంబులెన్స్, మృత్యుశకటంగా మారింది. ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన నెల్లూరులోని ఇరగాళ్లమ్మ ఆలయం సమీపంలో జరిగింది. అదుపుతప్పిన ఓ ప్రైవేటు అంబులెన్స్ వాహనం బీభత్సం సృష్టించింది. రహదారి పక్కన నిలబడి వున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.